నిజామాబాద్, డిసెంబరు 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ బార్ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్న జిల్లా న్యాయవాదులు ఈ పైలింగ్ చేసుకోవాలని బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ కోరారు. భారత సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఇ కోర్టు వెబ్ సైట్‌లో పేరు నమోదు చేసుకుని వెబ్ సైట్ లోనే సివిల్ దావాలు, క్రిమినల్ కేసులలో బెయిలు దరఖాస్తులు చేసుకోవడానికి వీలు అవుతుందని ఆయన తెలిపారు.
దరఖాస్తులు జిల్లా కోర్ట ఆవరణంలో ఉన్న ఇ కోర్టు సర్వీసెస్ ఆన్ లైన్ పోర్టల్‌లోనే తెలంగాణ బర్ కౌన్సెల్ సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ ఆధార్ అడ్రస్ ప్రూఫ్ ఫోటో తోపాటు న్యాయవాదులు ప్రమాణం చేసి నమోదుకు అవకాశం ఉందని అన్నారు.
ప్రతి న్యాయవాది ఇ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు రాష్ట్ర హై కోర్టు ఆదేశం మేరకు జనవరి 15 లోగా న్యాయవాదులు అందరు తప్పక ఈ ఫైళ్లింగ్ చేసుకోవాలని సూచించారు. అట్లాగే బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆదేశం మేరకు న్యాయవాదులందరూ డిసెంబర్ 31 లోపు సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ రెన్యువల్ సంబంధిత సర్టిఫికెట్లతో అప్లికేషన్లు బార్ కౌన్సిల్లో దరఖాస్తు చేసుకోవాలని న్యాయవాదులు అందరు తప్పక తమ వృత్తి నిర్వహణ సర్టిఫికెట్లను పొందాలని కోరారు.