కామారెడ్డి, డిసెంబరు 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి పట్టణంలోని సైలని బాబా కాలనీలో కాంగ్రెస్ కార్యకర్త సోదరుడు గుండెపోటుతో సౌదీలో మృతి చెందడంతో వారి కుటుంబాన్ని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పరామర్శించారు.
మృతదేహాన్ని గల్ఫ్ దేశం నుండి అధికారులతో మాట్లాడి స్వదేశానికి తీసుకురావడం జరిగింది. కాగా గురువారం మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ప్రభుత్వం నుండి గల్ఫ్ బాధితులకు కేటాయించిన నిధుల ద్వారా కుటుంబానికి ఆర్థిక సాయం చేసి ఆదుకుంటామన్నారు.