నిజామాబాద్, డిసెంబరు 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అక్రమ కేసులో బీజేపీ పార్టీ ఎన్ని నిర్భంధాలకు గురి చేసినా మొక్కవోని ధైర్యంతో ప్రజా క్షేత్రంలో పోరాటం సాగిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 29వ తేదీన నిజామాబాద్ కు విచ్చేచున్నారని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 29న ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి నిజామాబాద్‌కు చేరుకుంటారని పేర్కొన్నారు. ఈ క్రమంలో డిచ్‌పల్లి వద్ద బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉదయం 10 గంటలకు ఘనస్వాగతం పలుకుతారని తెలిపారు. అనంతరం బైపాస్ రోడ్డు మీదుగా సుభాష్‌నగర్ ఎస్‌ఎఫ్‌ఎస్ సర్కిల్ వరకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
అనంతరం 10:30 నిమిషాలకు ఎస్‌ఎఫ్‌ఎస్ సర్కిల్ వద్దనున్న తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్సీ కవిత పుష్పాంజలి ఘటిస్తారు. అక్కడే ప్రజలను, బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలను ఉద్ధేశించి ఎమ్మెల్సీ కవిత ప్రసంగిస్తారని జీవన్ రెడ్డి వెల్లడిరచారు.