కామారెడ్డి, డిసెంబరు 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా బ్యాక్ లాగ్‌లో జరుగుతున్న అక్రమాలపై ఓయూ విద్యార్థి నిరుద్యోగ రక్షణ జేఏసీ మైహిపాల్ యాదవ్ కామారెడ్డి ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మైపాల్ యాదవ్ మాట్లాడుతూ కామారెడ్డిలో మళ్లీ దొడ్డి దారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తకి ప్రయత్నం జరుగుతున్నాయని తెలిపారు.
రెండు నెలల కిందట సోమాజిగూడ ప్రెస్ క్లబ్బు వేదికగా ప్రభుత్వం దృష్టికి ఈ సమాచారాన్ని తీసుకువెళ్లిన అంతేకాకుండా నవంబర్ 29 న నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ద్వారా తెలియజేయడం జరిగిందని అంతేకాకుండా డిసెంబర్ 20 తేదీన బషీరాబాద్ ప్రెస్ క్లబ్లో చెప్పడంతో అప్పుడు వెంటనే నామమాత్రంగా ఆపివేసి అందరూ మర్చిపోయారని మళ్లీ తొందరలో బ్యాగ్ లాక్ ఉద్యోగులలో మున్సిపల్, ఇరిగేషన్ ,రెవిన్యూతో పాటు అనేక రకాల డిపార్ట్మెంట్లో అక్రమాల భర్తీకి సలహాలు జరుగుతున్నాయని సమాచారం వుందన్నారు.
కామారెడ్డిలో బ్యాక్ లాగ్ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. ఎవరైనా ఉద్యోగాలను డబ్బులతో కొనుకుంటే వారి పూర్తి సమాచారం రాష్ట్ర కమిషనర్‌కు, సీఎస్‌కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. అందుకే నిరుద్యోగులకు రక్షణగా తెలంగాణ నిరుద్యోగ రక్షణ జెఏసి ఏర్పడిరదని చైర్మన్ మహిపాల్ యాదవ్ అన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకుంటే రాష్ట్రా వ్యాప్తంగా బస్ యాత్ర చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో డప్పు సురేష్, బి ఎల్ ఫ్ రాష్ట్ర నాయకులు వడ్ల సాయికృష్ణ, జిల్లా నాయకులు ప్రసాద్, పాల్గొన్నారు.