ఎల్లారెడ్డి, డిసెంబరు 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఎల్లారెడ్డి నియోజకవర్గం: గాంధారి మండలం పెద్ద పోతంగల్ మరియు మేడిపల్లి గ్రామాల మధ్య ఉన్న బుగ్గగండి రోడ్డు గుంతలమయం కావడంతో గ్రామస్థులు ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకురాగా ప్రజల కోరిక మేరకు ఎమ్మెల్యే మదన్ మోహన్ స్పందించి అధికారులతో మాట్లాడారు.
కాంట్రాక్టర్ సమస్య వల్ల రోడ్ నిర్మాణ పనులు మధ్యలోనే అడిగిపోవడం జరిగింది అని తెలిపారు. మదన్ మోహన్ పెండిరగ్ బిల్లుల సమస్య పై కాంట్రాక్టర్ తో మాట్లాడి 14 కోట్ల విలువ అయిన బుగ్గ గండి రోడ్డు, బిటి రోడ్డు పనులు కొరకు 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి శనివారం పనులు ప్రారంభించేలా చేశారు.