కామారెడ్డి, డిసెంబరు 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీ మహిళ మానస (26) కు కావలసిన బి పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రంలో లభించకపోవడంతో వారికి కావలసిన రక్తాన్ని కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన వ్యాపారవేత్త ఎర్రం ఈశ్వర్ మానవతా దృక్పథంతో స్పందించి 13 వ సారి కామారెడ్డి రక్తనిధి కేంద్రంలో అందజేశారని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్లాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేయకపోతే వారి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉంటాయన్నారు. సకాలంలో రక్తం అందకపోవడంలో దేశవ్యాప్తంగా చాలామంది ప్రాణాలను కోల్పోవడం జరుగుతుందని ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తూ ఆదర్శంగా నిలిచిన ఈశ్వర్ కు ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రాజన్న తరఫున అభినందనలు తెలిపారు.