నిజామాబాద్, డిసెంబరు 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మరమ్మతులు కొనసాగుతున్న దృష్ట్యా నవీపేట వద్ద గల 188 నెంబర్ లెవెల్ క్రాసింగ్ రైల్వే గేటును 2025 జనవరి 1వ తేదీ వరకు మూసి ఉంచడం జరుగుతుందని దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సీనియర్ సెక్షన్ ఇంజినీర్ బీ.శ్రీనివాస్ తెలిపారు. మరమ్మత్తు పనుల కారణంగా ఈ నెల 26 ఉదయం 7.00 గంటల నుండి రైల్వే గేటు మూసివేయబడినదని అన్నారు.
ఈ నెల 30న రైల్వే గేటును తెరువాల్సి ఉండగా, అదనపు మరమ్మత్తు పనులు చేపడుతున్నందున రైల్వే గేటు మూసివేతను మరో రెండు రోజుల పాటు పొడిగించడం జరిగిందని అన్నారు. జనవరి 01 అర్ధరాత్రి అనంతరం రైల్వే గేటును తెరుస్తామని, రాకపోకలను యధావిధిగా పునరుద్ధరించబడతాయని తెలిపారు. ప్రయాణికులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించి, మరో రెండు రోజుల పాటు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు జరపాలని సూచించారు.
నిజామాబాద్-బాసర మార్గంలో ప్రయాణించాల్సిన ద్విచక్ర వాహనదారులు కమలాపూర్, మహంతం, మొకనపల్లి, గుండారం మీదుగా, ఇతర వాహనదారులు కల్యాపూర్, సాటాపూర్, తడ్బిలోలి, ఫకీరాబాద్ మీదుగా రాకపోకలు సాగించాలని సీనియర్ సెక్షన్ ఇంజినీర్ బీ.శ్రీనివాస్ కోరారు.