ఉనికి కోసమే కాంగ్రెస్‌ పై కవిత అబద్దాలు

నిజామాబాద్‌, డిసెంబరు 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ఉనికి కోసం కల్వకుంట్ల కవిత అబద్ధాలు మాట్లాడుతుందని, ఏ ప్రభుత్వ హయాంలో క్రైమ్‌ రేట్‌ పెరిగిందో ఏ ప్రభుత్వ హయాంలో క్రైమ్‌ రేట్‌ తగ్గిందో చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని, మీరు సిద్ధమైతే మాతో చర్చకు రావాలని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు మాణాల మోహన్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం గాని, రైతు సోదరులకు రెండు లక్షల లోపు రుణమాఫీ చేశాం. అదేవిధంగా వంట గ్యాస్‌ సిలిండర్ను 500 రూపాయలకే అందిస్తున్నామని, ఆరోగ్య శ్రీ పరిమితిని 10 లక్షల వరకు పెంచామని, పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ను కాంగ్రెస్‌ ప్రభుత్వం అందించిందన్నారు.

10 సంవత్సరాలుగా టిఆర్‌ఎస్‌ సమయంలో రెసిడెన్షియల్‌ స్కూల్‌ విద్యార్థుల ఆహారం గురించి పట్టించుకోక వారిని ఇబ్బందులకు గురిచేస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డైట్‌ మరియు కాస్మెటిక్‌ చార్జీలను 200 శాతం పెంచిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదని, టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతనే నిజం షుగర్‌ ఫ్యాక్టరీ మూతపడిరదన్నారు. దానిని కాంగ్రెస్‌ ప్రభుత్వం త్వరలోనే ప్రారంభిస్తుందని తెలిపారు.

టిఆర్‌ఎస్‌ హయంలో లాగా ప్రతిపక్ష ఎంఎల్‌ఏలను కట్టడి చేసే సంస్కృతి కాంగ్రెస్‌ పార్టీది కాదని, దానివల్లని ఈరోజు టిఆర్‌ఎస్‌ బిజెపి ఎమ్మెల్యేలు ఎక్కడికైనా వెళ్లి ప్రభుత్వ అధికారులతో పనులు చేయించుకుంటున్నారన్నారు. నిజామాబాద్‌ జిల్లా ప్రజలు కవితను మర్చిపోయారని కేవలం కాంగ్రెస్‌ పార్టీని విమర్శించడం వల్ల మళ్ళీ ప్రజలలో గుర్తింపు ఉంటుందని కవిత అనుకోవడం చూస్తుంటే ఆది ఆమె అవివేకానికి నిదర్శనమని, ప్రజలు చేసిన అభివృద్ధిని మాత్రమే గుర్తుంచుకుంటారని దీనిని కవిత గుర్తు చేసుకోవాలని సూచించారు.

కాంగ్రెస్‌ పార్టీ వచ్చిన ఏడాది పాలనలో ప్రజలకు రాక్షస పాలన నుండి విముక్తి లభించి ప్రజా పాలన అందించి ఇచ్చిన హామీలలో దాదాపు 80 శాతం హామీలను పూర్తి చేయడం జరిగిందని, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతుబంధు పేరుతో రోడ్లకు గుట్ట భూములకు, వెంచర్‌గా మారిన భూములకు డబ్బులు వేయడం జరిగిందన్నారు.

కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కేవలం సాగు చేసే భూములకే రైతుబంధు వేయాలనే ఆలోచనతో సాగుచేసే భూమిని క్రమబద్ధీకరిస్తున్న సందర్భంలో రైతుబంధు కొంచెం ఆలస్యం అవ్వడం జరుగుతుందని, కానీ ఖచ్చితంగా త్వరలోనే సంక్రాంతికి ముఖ్యమంత్రి గారు రైతుబంధు విషయంపై ప్రకటన విడుదల చేస్తారన్నారు. పోలీసు వ్యవస్థ గతంలో కంటే భిన్నంగా ప్రజల రక్షణకే ముందుగా పనిచేస్తుందని, కేవలం కాంగ్రెస్‌ ను విమర్శించడం వల్ల కవిత గొప్ప వ్యక్తి కాదని ప్రభుత్వం చేసే మంచి పనులలో భాగస్వామ్‌ కావాలని కాంగ్రెస్‌ వచ్చిన ఏడాది పాలనలో ప్రజలకు ప్రజాపాలన అందించడం జరిగిందన్నారు.

Check Also

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »