విద్యార్థులను చైతన్యవంతం చేయండి….

నిజామాబాద్‌, డిసెంబరు 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

జూనియర్‌ కళాశాల స్థాయిలోనే విద్యార్థిని, విద్యార్థులను చదువుతోపాటు, క్రమశిక్షణ, యాంటీ డ్రగ్స్‌పై చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఆయా కళాశాలలలో ప్రిన్సిపాల్‌లు, అధ్యాపకులపైనే ఉందని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అంకిత్‌ అన్నారు. సోమవారం సాయంత్రం నిజామాబాద్‌ కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో నిజామాబాద్‌ జిల్లా ఇంటర్‌ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడారు.

మానసికంగా కృంగిపోకుండా, ఆత్మహత్య శరణ్యం అనే దానికి విద్యార్థులను దరి చేరకుండా, ఎప్పటికప్పుడు వారికి మానసిక డాక్టర్ల ద్వారా సమావేశ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే టెలి మానస్‌పై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లా ఆంటీ డ్రగ్స్‌ కమిటీ చైర్మన్‌ డి.ఎస్‌.పి శ్రీ సోమనాథ్‌ మాట్లాడుతూ ప్రతి కళాశాలలో విధిగా ప్రిన్సిపాల్‌లు మత్తు పదార్థాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడంతోపాటు వారిని ఎప్పటికప్పుడు చైతన్యవంతం చేయాలని సూచించారు.

విద్యార్థుల్లో క్రమశిక్షణ కోల్పోకుండా కళాశాల స్థాయి నుండి ప్రారంభం కావాలని అన్నారు. భవిష్యత్తులో సామాజిక రుగ్మతలను వారిని దరిచేరనీయకుండా ప్రిన్సిపాల్‌ లు, అధ్యాపకులు కృషి చేయాలని అన్నారు.

జిల్లా ఇంటర్‌ విద్య అధికారి శ్రీ తిరుమల పూడి రవికుమార్‌ మాట్లాడుతూ కళాశాల స్థాయిలో ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ సూచించిన మేరకు అన్ని కళాశాలలో వెంటనే సిలబస్‌ పూర్తి చేసి ప్రతి కళాశాలలో విద్యార్థులను రానున్న ప్రయోగ పరీక్షలకు, వార్షిక పరీక్షలకు సంసిద్ధం చేయాలని సూచించారు. ప్రతి కళాశాలలో సీ.సీ. కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే ప్రతి కళాశాలలో ఆంటీ డ్రగ్స్‌ కమిటీలు, ఆంటీ డ్రగ్‌ కమిటీ లు ఏర్పాటు చేసి విద్యార్థులలో క్రమశిక్షణను పెంపొందించాలని సూచించారు. అలాగే విద్యార్థులలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకుగాను నెలకొల్పిన టెలిమానస్‌ 14416 నంబర్‌ విద్యార్థులకు తెలియజేయాలని అన్నారు. మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఆత్మహత్యల వైపు వారి దృష్టి మరలకుండా వారిని ఎప్పటికప్పుడు చైతన్యం చేయాలని అన్నారు.

సైకాలజిస్ట్‌ డాక్టర్‌ రవితేజ మాట్లాడుతూ ప్రతి కళాశాల స్థాయిలో ఆంటీ డ్రగ్స్‌ కమిటీలు ఏర్పాటు చేసి విద్యార్థుల మానసిక స్థితిగతులను అంచనా వేసేందుకు ప్రిన్సిపాల్‌ లు, అధ్యాపకులు కృషి చేయాలని అన్నారు. విద్యార్థుల మానసిక. పరిస్థితిని అంచనా వేసి వారికి ఇంటర్‌ బోర్డు సూచించిన మేరకు మానసికంగా సిద్ధం చేయడానికి తాము అందుబాటులో ఉంటామని డాక్టర్‌ రవితేజ అన్నారు.

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్‌ లు, ప్రైవేటు, ఎయిడెడ్‌, అన్ని రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్‌లు పాల్గొన్నారు.

Check Also

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »