కామారెడ్డి, డిసెంబరు 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోనీ ప్రజల సమస్యలు పరిష్కరించుకోవడానికి అర్జీలను కలెక్టర్ కు సమర్పించడం జరుగుతున్నది. అట్టి ప్రజావాణి ద్వారా సంబంధిత అధికారులు ప్రజల దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో (78) దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలించి పరిష్కరించడానికి ఆయా అధికారులకు పంపించడం జరుగుతున్నదని తెలిపారు. భూ సమస్యలు, సదరం సర్టిఫికెట్స్, వ్యక్తిగత సమస్యలు వంటి అర్జీలు రావడం జరిగాయని తెలిపారు.
ప్రజావాణిలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథ్ రావు, జడ్పీ సీఈవో చందర్, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.