Yearly Archives: 2024

అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయించేందుకు అధికారులు పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అర్వింద్‌ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శనివారం ఎంపీ అర్వింద్‌ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్పాల్‌ సూర్యనారాయణ, ఆర్మూర్‌ ఎమ్మెల్యే …

Read More »

రేబిస్‌ వ్యాధి పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రేబిస్‌ వ్యాధి పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం రోజున జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ప్రపంచ రెబిస్‌ వ్యాధి దినోత్సవం సందర్భంగా పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రేబిస్‌ ప్రాణాంతక వ్యాధి అని అన్నారు. కుక్క కాటుకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. …

Read More »

నేటి పంచాంగం

శనివారం, సెప్టెంబరు 28, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : ఏకాదశి సాయంత్రం 4.43 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఆశ్రేష పూర్తియోగం : సిద్ధం తెల్లవారుజామున 3.17 వరకుకరణం : బాలువ సాయంత్రం 4.43 వరకుతదుపరి కౌలువ తెల్లవారుజామున 5.10 వరకు వర్జ్యం : సాయంత్రం 6.11 – 7.51దుర్ముహూర్తము : ఉదయం 5.52 – …

Read More »

సబ్‌ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు

బాన్సువాడ, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని బొర్లం శివారులో బోర్లం గ్రామ పంచాయతీ నుండి అనుమతులు తీసుకొని బాన్సువాడ శివారులో భవనం నిర్మించి కళాశాల నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం బిజెపి నాయకులు సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ మున్సిపాలిటీకి సంబంధించిన రికార్డులలో భవనం లేదని సమాచార హక్కు చట్టం ద్వారా …

Read More »

కుటుంబాన్ని సంస్కరించే బాధ్యత తల్లిదండ్రులదే

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జీవన విధానంలో హిందూ సంస్కృతి అత్యంత ప్రతిష్టాత్మకమైనదని ఆ సంస్కృతికి ఆధారం కుటుంబ వ్యవస్థ అని ఆ కుటుంబాన్ని సంస్కరించే బాధ్యత ఎప్పటికీ తల్లిదండ్రుల దేనని రాష్ట్ర సేవికాసమితి జిల్లా బౌద్ధిక్‌ ప్రముఖ్‌ శుభ వ్యాఖ్యానించారు. భారతమాత భజన్‌ పరివార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన గోల్‌ హనుమాన్‌ ప్రఖండ భజన మండలి సమ్మేళనానికి ముఖ్య వక్తగా విచ్చేసిన ఆవిడ …

Read More »

ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణవాది, స్వాతంత్య్ర పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ 109 జయంతి వేడుకను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి ఉత్సవాలు జరిపారు. అర్బన్‌ శాసనసభ్యులు ధన్పాల్‌ సూర్యనారాయణ, నగర మేయర్‌ నీతూ కిరణ్‌, అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌, బీ.సి, పద్మశాలి కుల సంఘాల ప్రతినిధులు, తదితరులు వినాయకనగర్‌ …

Read More »

లింగన్నపేట్‌ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగన్నపేట్‌ గ్రామాన్ని ఆదర్శవంతంగా, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం రోజున లింగంపెట్‌ నాగన్న బావి వద్ద ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, లింగంపేట్‌ లోని నాగన్న బావి వలన పర్యాటక ప్రాంతంగా పరిగణించుకోవచ్చని అన్నారు. భవిష్యత్తు తరాల వారికి నాటి కట్టడాలను …

Read More »

బాపూజీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి సందర్భంగా కామారెడ్డి బస్‌ స్టాండ్‌ సమీపంలోని ఆయన విగ్రహానికి కలెక్టర్‌ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ఆర్డీఓ రంగనాథ్‌ రావు, జిల్లా వెనుకబడిన తరగతుల …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, సెప్టెంబరు 27, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : దశమి సాయంత్రం 4.19 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : పుష్యమి తెల్లవారుజామున 4.46 వరకుయోగం : శివం తెల్లవారుజామున 3.52 వరకుకరణం : విష్ఠి సాయంత్రం 4.19 వరకుతదుపరి బవ తెల్లవారుజామున 4.31 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.14 – 1.54దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరి మృతి

నందిపేట్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలో గల ఊర చెరువు లో గణేష్‌ విగ్రహాల ఇనుప స్టాండ్లు తీస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి పత్రి కనకయ్య మృతి చెందాడని ఎస్‌ ఐ. హరిబాబు తెలిపారు. నిన్న ఉదయం పనికి వెళుతున్నానని చెప్పి ఇంట్లో నుండి పోయాడని రాత్రి అయిన తిరిగి రాలేదని మృతిని భార్య యాసిన్‌ తెలిపినట్లు ఎస్‌. ఐ చెప్పారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »