బాన్సువాడ, జనవరి 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ ప్రభుత్వ న్యాయవాదిగా లక్ష్మీనారాయణమూర్తి గురువారం కోర్టు జడ్జి టిఎస్పి భార్గవి సమక్షంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో ప్రభుత్వ న్యాయవాదిగా నియామకానికి కృషి చేసిన వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కోర్టు న్యాయవాదులు ఏజీపీగా నియమకమైన లక్ష్మీనారాయణ మూర్తికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు రమాకాంత్, దత్తాత్రేయ, ఖలీల్, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.