నిజామాబాద్, జనవరి 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
భూతకాలాన్ని, వర్తమాన కాలంతో సరిచూసుకుని భవిష్యత్ కాలంతో కలిసి నడవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్, ఉపాధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి వసంత్ రావు, కార్యదర్శి సురేష్ దొన్పాల్, కోశాధికారి దీపక్ లు నూతన సంవత్సరం శుభవేళ పూలమాలలు, మిఠాయిలు తనకు అందజేసిన సందర్భంలో మూడేళ్ళ పదవి కాలంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ సభ్యుల సహాయ, సహకారాలు మరువలేనివని తెలిపారు.
బార్ అండ్ బెంచ్ మద్య నెలకొన్న తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటు నూతన సంవత్సరాధితో పయనిద్దామని ఆమె అన్నారు. బార్ అండ్ బెంచ్ నెలకొల్పిన సంప్రదాయాలను కొనసాగిస్తామని బార్ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు.
న్యాయవాది రాజ్ వీర్ మృతికి నివాళి
ఆర్మూర్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది రాజ్ వీర్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తు బార్ తీర్మానం చేసినట్లు అధ్యక్షుడు జగన్మోహన్ తెలిపారు. రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళి ఘటించారు.