బాన్సువాడ, జనవరి 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సివిల్ సప్లై హమాలీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ బాన్సువాడలో హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం రెండో రోజుకు చేరింది.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్ రాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై హామాలీలకు పెంచిన రేట్ల జీవోను వెంటనే విడుదల చేయాలని, హమాలీలకు 10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించి, మహిళ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసి పని భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో భూమయ్య, చిన్న సాయిలు, సాయిలు, గంపల సాయిలు, రేంజర్ల హన్మండ్లు, భూధవ్వ హమాలీలు తదితరులు పాల్గొన్నారు.