కామారెడ్డి, జనవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సి.ఏం.ఆర్. సరఫరా వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం పాల్వంచ మండలం భవానీపేట్ గ్రామంలోని గాయిత్రి అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లు ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సి.ఏం.ఆర్. సరఫరా త్వరితగతిన చేయాలని అన్నారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యం, సరఫరా చేయాల్సిన బియ్యం వివరాలను పౌరసరఫరాల అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లును శుభ్రంగా ఉంచాలని మిల్లు యజమానికి తెలిపారు. కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, తహసీల్దార్ లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.