బాన్సువాడ, జనవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
విద్యార్థులలో ఉన్నత విద్య ప్రమాణాలను పెంచేందుకు పోటీ పరీక్షలు ఎంతో దోహదపడతాయని పట్టణ సీఐ మండల అశోక్ శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో వివిధ మండలాలలోని పాఠశాల విద్యార్థులకు తెలంగాణ ఇంగ్లీష్ ఓలంపియాడ్ ఉన్నత విద్యా పై పాఠశాల విద్యార్థులకు ఉపన్యాస పోటీ పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్బంగా అయన విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో ఉన్నతంగా ఎదిగేందుకు విద్య ఎంతో ముఖ్యమని, విద్యా అవకాశాలను వినియోగించు కొని పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విట్టల్, సత్యనారాయణ, ప్రమోద్ కుమార్, రాఘవేందర్, పండరి గౌడ్, నర్సింగ్ రావు, ఆనంద్ కుమార్, అంజయ్య, హన్మాండ్లు, సలీమ్ వినోద్, అమర్ సింగ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.