బాన్సువాడ, జనవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
విద్యార్థులు చిన్ననాటి నుండే శాస్త్రీయ నైపుణ్యాలు కలిగి ఉన్నట్లయితే దేశానికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా కృషి చేయాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. శుక్రవారం బాన్సువాడ మండలంలోని కొయ్యగొట్ట గురుకుల పాఠశాలలో జీవశాస్త్ర ప్రతిభ పాటవ పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ నైపుణ్యాలు పెంచుకునేందుకు ప్రాథమిక స్థాయి నుండి ప్రణాళిక బద్ధంగా మెలకువలు నేర్చుకోవాలని, మూఢనమ్మకాలను నమ్మరాదన్నారు. విద్యార్థులు శాస్త్రీయంగా అవగాహన కలిగి ఉండి భవిష్యత్తులో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఉపాధ్యాయులుగా సమాజంలో తమకంటూ గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. పాఠశాల స్థాయిలో, మండల స్థాయిలో విద్యార్థులకు జిల్లా స్థాయిలో పరీక్షలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ను శాలువా జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీబాయి,ప్రతాపరెడ్డి, కృష్ణకర్ రావు, సురేష్, శ్రీరామ్, సత్యనారాయణ, గంగాధర్ బాలరాజు ,మహేష్, లక్ష్మణ్ సింగ్, రాజ్ కుమార్, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.