కామారెడ్డి, జనవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం స్థానికంగా ఓల్డ్ ఏజ్ హోం నూతనముగా నిర్మించిన భవనాన్ని కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. ఓల్డ్ ఏజ్ హోం నిర్మాణ పనులు పూర్తయినందున ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు.
నీటి సరఫరాకు పైప్ లైన్ బోరు నుండి వేయాలని ఇంజనీరింగ్ అధికారులకు తెలిపారు. భవనం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ రాజన్న, మున్సిపల్ కమీషనర్ స్పందన, పంచాయతీ రాజ్ ఈఈ దుర్గా ప్రసాద్, మిషన్ భగీరథ ఈ ఈ రమేష్, సిడిపీఓ రోఛిష్మ, తహసీల్దార్ జనార్ధన్, ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.