కామారెడ్డి, జనవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సావిత్రి బాయి జీవిత చరిత్ర ను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సావిత్రి బాయి ఫూలే జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జనవరి 3 న మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉత్తర్వులు జారీచేసింది శుక్రవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళల కోసం సావిత్రి బాయి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి మహిళలకు విద్యాబోధన చేయడం జరిగిందని తెలిపారు.
తన భర్త జ్యోతిరావు ఫూలే సహకారంతో పాఠశాలలు ఏర్పాటు చేసి మహిళలకు విద్యాబోధన అందించడం జరిగిందని తెలిపారు. సావిత్రి బాయి నినాదర్శంగా తీసుకోవాలని అన్నారు. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రి బాయి పనిచేశారని తెలిపారు. వెనుకబడిన తరగతుల కోసం ఆమె ఎంతో కృషి చేశారని వివరించారు. అదనపు కలెక్టర్ వి.విక్టర్ మాట్లాడుతూ,సామాజిక సేవా కార్యక్రమాలను సావిత్రి బాయి నిర్వహించారని, పెద వర్గాలవారికి విద్యను అందించిన వ్యక్తి అని అన్నారు.
అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ, మహిళా ఉపాడ్యూరాళ్లను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విద్య శాఖాధికారి రాజు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.