ఆర్మూర్, జనవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆలూరు గ్రామంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం హర్షనీయమని మహిళా అధ్యాపకులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. విద్య యొక్క ప్రాధాన్యం గురించి తెలిపారు. ఎలాంటి కనీస వసతులు లేని కాలంలోనే దేశంలోనే ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలుగా సేవలందించి ఎంతో మంది జీవితాలను బాగు చేసిన సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకొని విద్యార్థినులు అన్ని రంగాలలో రాణించాలని తెలిపారు. ఈ సందర్బంగా మహిళా ఉపాధ్యాయినిలను ఘనంగా సన్మానించారు.