ఆర్మూర్, జనవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్మూర్ పట్టణంలోని కాశీ హనుమాన్ సంఘంలో సర్వాసమాజ్ అద్యక్షుడు కొట్టల సుమన్‌ని శనివారం కాంగ్రెస్ నాయకులు సన్మానించారు.
ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన సుమన్‌కు అభినందనలు తెలిపి పట్టు శాలువా పూలమాలతో కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు ఎస్.కె. బబ్లూ, కిసాన్ కేత్ పట్టణ అధ్యక్షుడు బోడమిది బాలకిషన్ లు సన్మానించారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు కొడిగేలా సుధాకర్, గుండు లోకేష్ పాల్గొన్నారు.