బాన్సువాడ, జనవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 26 నుండి జనవరి 26 వరకు సంవిధాన్ బచావో ఆందోళన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మైనార్టీ శాఖ పిలుపుమేరకు ఆదివారం హైదరాబాదులోని కులీ కుతుబ్షా గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభకు ఆల్ ఇండియా మైనార్టీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఇమ్రాన్ ప్రతాప్ ఘాడీ అధ్యక్షతన నిర్వహించే బహిరంగ సభకు జిల్లాలోని మైనార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాని విజయవంతం చేయాలని జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖలేఖ్ ఆన్నారు.
శనివారం బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా నుండి అధిక సంఖ్యలో మైనార్టీలు హాజరుకావాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు కాలేక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అసద్ బీన్ మోసిన్, షాహబ్,మండల మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ నబీ, వహాబ్, పట్టణ మైనార్టీ అధ్యక్షులు అప్రోజ్, కమురుద్దీన్, అజీమ్ మైనార్టీలు తదితరులు పాల్గొన్నారు.