అంధులకు ప్రభుత్వం చేయూతనిస్తుంది…

కామారెడ్డి, జనవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

అంధుల కోసం లూయీ బ్రేల్‌ ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిని కనుగొన్న అక్షర ప్రధాత అని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌ లో లూయీ బ్రెల్‌ 216 వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటం ముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం తెలంగాణా రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ వారిచే బ్రెయిలీ లిపి లో ప్రచురించబడిన బ్రేల్‌ క్యాలెండర్‌ ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, సి.డి.పి.ఒ. రోచిష్మ , దివ్యంగుల సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సైబర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »