నిజామాబాద్, జనవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఈనెల 5వ తేదీ నుండి 9 వరకు శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ స్టేడియం జల్గావ్, మహారాష్ట్రలో జరుగుతున్న 68వ స్కూల్ గేమ్స్ జాతీయ సాఫ్ట్ బాల్ అండర్ 17 బాల బాలికల పోటీలలో జిల్లా క్రీడాకారులు పాల్గొంటున్నారు.
బాలికల విభాగంలో…
ఎస్. నిత్యశ్రీ (జెడ్పిహెచ్‌ఎస్ తొర్లికొండ),
డి.అశ్విని , (జెడ్పిహెచ్‌ఎస్ ముచ్కూర్),
జి సాత్విక, జి శ్రావిక (టీఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ గర్ల్స్ సుద్దపల్లి),
బాలుర విభాగంలో…
ఎం.నిఖిల్ చంద్ర (నారాయణ హై స్కూల్ ఆర్మూర్),
ఎస్.సిద్ధార్థ (సత్యశోధక్ పాఠశాల సిరికొండ),
ఎస్.లక్వేందర్ కుమార్ (టీఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ బోధన్),
ఎన్ ప్రణయ్ (టీఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ ఉప్పల్వాయి).
ఈ యొక్క జట్లకు కోచ్ మేనేజర్లుగా మర్కంటి గంగా మోహన్, సోప్పరి వినోద్, ప్రశాంత్ కుమార్, బి అంజలి వ్యవహరిస్తున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగమణి తెలిపారు.