ఖమ్మం, జనవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
స్థానిక వైరా రోడ్ కోణార్క్ హోటల్‌లో జిల్లా గంగపుత్ర సంఘ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్, రాష్ట్ర గంగపుత్ర సంఘం అధ్యక్షులు గడప శ్రీహరి పాల్గొన్నారు. నగర మేయర్ పునుకొల్లు నీరజ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ గంగపుత్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికోసం ప్రత్యేకంగా ఫిష్ మార్కెట్లు ఏర్పాటు చేయడమే కాక వారు వ్యాపారంలో అధిక లాభాలు పొందేలా ప్రభుత్వం సహాకారం అందిస్తుందని తెలిపారు. తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ తుమ్మల నాగేశ్వరావు అన్ని కులాలను సమాన దృష్టిలో చూస్తూ అందరూ ఎదగాలని ఎల్లప్పుడూ ఆశిస్తారని గంగపుత్రుల డిమాండ్ల సాధనకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
మత్స్య శాఖ అధికారి శివప్రసాద్ మాట్లాడుతూ గంగపుత్రులు ఐకమత్యంగా మెలుగుతూ వారి వృత్తిని కొనసాగించాలని వారికి ఎట్టి ఆపద వచ్చిన ప్రభుత్వ పక్షాన సహకారం అందిస్తామని తెలిపారు.
రాష్ట్ర అధ్యక్షులు గడప శ్రీహరి మాట్లాడుతూ గంగపుత్రులు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబడి ఉన్నారని వారు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు . చేపలు పట్టే హక్కు గంగపుత్రులకు జన్మ హక్కుగా ఉందని, వారికి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని కోరారు. జిల్లా అధ్యక్షులు కన్నం ప్రసన్న కృష్ణ మాట్లాడుతూ మత్స్యకారులకు ఆసరా పింఛను వర్తింపజేయాలని, జిల్లా కేంద్రంలో గంగపుత్రులకు స్థలం కేటాయించాలని వారు కోరారు.
ఖమ్మం నగర గంగపుత్ర సంఘానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన చేతి కృష్ణ, కార్యదర్శి డోలి శ్రీనివాస్, కోశాధికారి కందరబోయిన మురళి నియామకపత్రాలు అందజేసి వారు సంఘ శ్రేయస్సు కోసం తోడ్పాటునందించాలని కోరారు. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన దేశ బోయిన సురేష్‌ని సంఫీుయులందరూ అభినందించారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ కన్నం వైష్ణవి, జిల్లా గంగపుత్ర సంఘం అధ్యక్షులు కన్నం ప్రసన్న, కృష్ణ కోశాధికారి పెద్దపల్లి సుధాకర్, యూత్ ప్రధాన కార్యదర్శి దేశబోయిన సురేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాక ఓం ప్రకాష్, రాష్ట్ర కార్యదర్శి పాకాల ఉపేందర్, రాష్ట్ర యూత్ అధ్యక్షులు అంబటి సుధాకర్, నాయకులు దేశ బోయిన తిరుపతయ్య, వంగాల వెంకట్, చింతల మల్లేశం, పిల్లి సుదర్శన్, కన్నం రమేష్, కీర్తి శ్రీనివాస్, సింగం అంజయ్య, పూస కిరణ్, జీజుల రోహిత్, కుడుముల సత్యనారాయణ, సింగు శ్రీనివాస్, నరుగుల రవికుమార్, గోధుమల శ్రీనివాస్, కీర్తి నాగరాజు, వడ్డే బోయిన రవి, గుండు ఉపేందర్, కందరబోయిన వెంకటేశ్వర్లు, మోసం యుగంధర్, పెద్దపల్లి సంజయ్, కన్నం నరేందర్, అంబటి రఘుబాబు, నరుగుల బలరాం శంకర్, దామెర దయాకర్, నరుగుల మురళి తదితరులు పాల్గొన్నారు.