బాన్సువాడ, జనవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తమ న్యాయమైన కోరికలను నెరవేర్చాలని కోరుతూ సివిల్ సప్లై హామాలీలు చేస్తున్న శాంతియుత నిరవధిక సమ్మెను పోలీసులు భగ్నం చేసి అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్ రాములు అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం హమాలీలకు పెంచిన రేట్లు విడుదల చేయాలని శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసుల చేత అరెస్టు చేయడం విడ్డూరమన్నారు. రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగానే కార్మికులు సమ్మె చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో గంపల సాయిలు, పుట్టి సాయిలు, చిన్న సాయిలు, భూదవ్వ, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.