ఆర్మూర్, జనవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ కోటార్మూర్‌లో గల విశాఖ నగర్‌లో గల శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో నూతనంగా ఎన్నుకోబడిన ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం ఉదయము ఆలయ సలహాదారులు మరియు విశాఖ నగర్ కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది.
కమిటీ 2025 నుండి 2026 వరకు రెండు సంవత్సరాలు ఆలయానికి సేవలు అందించనుంది. అధ్యక్షులుగా లోక దయాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా లిక్కి గంగాధర్, కోశాధికారిగా కోమటి శెట్టి రాజలింగం, ఉపాధ్యక్షులుగా వాక హరిప్రసాద్, సంయుక్త కార్యదర్శి, ప్రచార కార్యదర్శిగా జక్కుల మోహన్, సంయుక్త కార్యదర్శిగా రంగు నవీన్‌లను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతనంగాఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ హైందవ ధర్మాన్ని కాపాడుతూ ఆలయ అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. కార్యక్రమంలో శంకర్, రాజేశ్వర్, లక్ష్మీ నరసయ్య, బెనికి నారాయణ, ఆలయ అర్చకులు గౌతమ్ పాండే, దీపక్ కుమార్, సతీష్ రెడ్డి, సంజయ్ గౌడ్, బోజారెడ్డి, రాజేందర్ గౌడ్, అశోక్, పుష్పమ్మ తదితరులు పాల్గొన్నారు.