నిజామాబాద్, జనవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ ఈ నెల 9న నిజామాబాద్ పర్యటనకు విచ్చేస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి.
ఉదయం 10.00 గంటలకు ఆయన జిల్లా అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2.00 గంటల వరకు మైనారిటీ వర్గాల వారి నుండి విజ్ఞాపనలు స్వీకరిస్తారని అధికారులు తెలిపారు.