నిజామాబాద్, జనవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని ప్రజలకు టాస్క్ ఫోర్స్ మరియు సి.సి.ఎస్, ఎ.సి.పి కద్రోజ్ నాగేంద్ర చారీ పలు సూచనలు చేశారు. చైనా మాంజా వాడడం వలన ప్రజలకు మరియు జంతువులకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉన్నదన్నారు.
చైనా మాంజా ఎవ్వరయిన నిలువ ఉంచిన, తయారుచేసిన, ఎవ్వరయిన అమ్మిన, అమ్మడానికి ఎవ్వరయిన ప్రోత్సహించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడుతాయన్నారు. కావున కొంత మంది ఇప్పటికే హైదరాబాద్ నుండి నిజామాబాద్‌కు చైనా మాంజా తరలించినట్లు పోలీసులకు సమాచారం ఉన్నదని, చైనా మాంజా సంబంధిత పోలీస్ స్టేషన్లో అప్పగించాలని, లేదా కాల్చి వేయాలని సూచించారు.
ఎవ్వరయిన బయట పడేసినట్లయితే ప్రజలకు మరియు జంతువులకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉన్నదని, విక్రయించిన మాంజాతో ఎదైనా ప్రమాదం జరిగినట్లయితే విక్రయ దారులు కూడా అట్టి కేసుకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎవ్వరయిన పై సూచనలకు విరుద్దంగా ఎవ్వరయిన చైనా మంజా నిలువచేసిన, అమ్మిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతుందన్నారు.
ఇప్పటివరకు 10 కేసులకన్న ఎక్కువ నమోదు చేయడం జరిగిందన్నారు. ఎవ్వరి వద్దనైనా అట్టి చైనా మాంజా ఉన్నట్లయితే వారు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ యందు అప్పగించాలని, లేనియెడల చైనా మాంజా ఎవ్వరైనా ఉపయోగిస్తున్నట్టు సమాచారం అందినట్టయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు నిర్వహించడం జరుగుతుందని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎవ్వరికైనా ఎలాంటి సమాచారం ఉన్నను టాస్క్ ఫోర్స్ ఎ.సి.పి 87126 59812 సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయని పేర్కొన్నారు.