బీర్కూర్, జనవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ మండలంలోని హనుమాజీపేట / కోనాపూర్‌లోని గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతితో పాటు 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు రీజినల్ కో ఆర్డినేటర్ గంగారం నాయక్, ప్రిన్సిపల్ ఎల్ శ్యామలాదేవి ఒక ప్రకటనలో తెలిపారు.
ఫిబ్రవరి 1వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు కులము సర్టిఫికెట్, ఆదాయం సర్టిఫికెట్, ఆధార్ కార్డుతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.