కామారెడ్డి, జనవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మాసోత్సవలలో భాగంగా సోమవారం ఆర్‌టిఏ ఆఫీస్, నరసన్నపల్లిలో ఊచిత కంటి పరీక్షలు, రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇట్టి అవగాహనా కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస రెడ్డి ప్రసంగిస్తూ కంటి పరీక్షలు విధిగా చేసుకోవాలని, కార్యక్రమంలో పాల్గొన్న డ్రైవర్లు, సాధారణ పౌరులని ఉద్దేశిస్తూ ప్రసంగించారు.
కార్యక్రమంలో ఉత్సాహంగా పదుల సంఖ్యలో కంటి పరీక్షలు చేయించుకున్నారు. రక్త దానం చేసినవారికి ప్రశంస పత్రాలు అందచేశారు. మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ నాగలక్ష్మి కార్యక్రమ నిర్వహణకి సహకరించిన వైద్య బృందానికి, రవాణా శాఖ సిబ్బందికి ధన్యవాదములు తెలిపారు.
మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ అఫ్రోజుద్దీన్ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా అభ్యుదయ పాఠశాల, దోమకొండ లొ అవగాహన కల్పించారు. ఆటో డ్రైవర్స్ విధివిధానాలు, నియమాలతో కూడిన ప్రతిజ్ఞ చేయించారు. రవాణా శాఖ అవగాహనా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న తీరునిచూసి పలువురు ప్రజాప్రతినిధులు, పౌరులు హర్షించారు.