బాన్సువాడ, జనవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జహిరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా బాన్సువాడ నియోజకవర్గం నుండి మెజార్టీ ఇచ్చి ఎంపీగా గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు పార్టీ కార్యకర్తలకు రుణపడి ఉంటానని ఎంపీ సురేష్ షెట్కర్ అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు విచ్చేసిన ఎంపి ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్రజలకు తాగునీటి కొరత తీర్చేందుకు అమృత్ 2.0 పథకంలో భాగంగా 52 కోట్ల నిధులతో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరును అందజేయడం జరుగుతుందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి,తోట లక్ష్మీకాంతరావు, జిల్లా కలెక్టర్ అశిష్ సంగ్వాన్, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్, సబ్ కలెక్టర్ కిరణ్మయి,మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు నార్ల రత్నకుమార్, నార్లరవీందర్, నార్ల సురేష్ గుప్తా, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు కాలేక్, శ్రీనివాస్ గౌడ్, అజీమ్, ఎజాస్, సాహెబ్, రహీస్, హకీమ్,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.