ఆర్మూర్, జనవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో బుధవారం నుంచి 14వ తేదీ వరకు జరిగే శివ మహాపురాణం కథలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, నందిపేట్‌లోని మంగి రాములు మహారాజ్ కు రాజస్థాన్ మార్వాడి సమాజ్ సభ్యులు హరీష్ కుమార్ హెడా పరశురాం, సామాజిక సేవకులు బోబిడే గంగా కిషన్ లు మంగళవారం ఆహ్వాన పత్రికలను అందజేశారు.
వారం రోజులపాటు జరిగే శివ మహా పురాణకథలో పాల్గొనాలని కోరారు. ఈ కథను గుజరాత్ రాష్ట్రంలోని అహ్మద్ నగర్ కు చెందిన యుగల్ శరణ్ మహారాజు వారం రోజులపాటు శివుని గురించి కథ రూపంలో చెబుతారన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు పెర్కిట్ లోని రమా సత్యనారాయణ స్వామి ఆలయం నుంచి క్షత్రియ కళ్యాణ మండపం వరకు కలశాలతో మహిళలు ఊరేగింపు నిర్వహిస్తారన్నారు. కాబట్టి ఈ కళాశాల ఊరేగింపుతో పాటు వారం రోజులపాటు జరిగే శివ మహాపురాణకథలో మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.
కార్యక్రమంలో రాజస్థాన్ మార్వాడి సమాజ్ సభ్యులు రాజేందర్ హెడ, రేవా సింగ్, శంకర్ భాయ్, కాంగ్రెస్ నాయకులు పండిత్ పవన్, విజయ్ అగ్రవాల్ తదితరులు పాల్గొన్నారు.