బాన్సువాడ, జనవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి రవాణా శాఖ, రోడ్డు భద్రత మాసోత్సవలలో భాగంగా మంగళవారం బన్సూవాడ నందు ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణ రావు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి, ఎంపి సురేష్ కుమార్ శెట్కార్, కలెక్టర్ ఆశిష్ సంగవాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ బాల రాజు, ఎంఐఇవో సలాం, మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ నాగలక్ష్మి, రవాణా శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన కళాశాల విద్యార్థుల రోడ్డు భద్రత ర్యాలీ ని పచ్చ జెండా ఊపి అట్టహసంగా ప్రారంభించారు.
జూపల్లి కృష్ణారావు, పోచారం శ్రీనివాస రెడ్డి హెల్మెట్ ధరించి రోడ్డు భద్రత ప్రాముఖ్యతని తెలిపారు. ర్యాలీ గా బయలుదేరిన విద్యార్థులు బన్సూవాడ విధుల్లో రోడ్డు భద్రత నినాదాలుతో ప్రజలను చైతన్యాపరుస్తూ ముందుకుసాగి కళాశాల చేరుకున్నారు. తదుపరి జూనియర్ కళాశాలలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత మాసోత్సవ సభలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ బాల రాజు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
సభలో ఎమ్మెల్యే విద్యార్థులని ఉద్దేశించి ప్రసంగించారు. బాన్సువాడ ప్రజల సౌకర్యార్థం రవాణా శాఖ కి నియోజకవర్గంలో ఎటువంటి సహాయసహకారాలు అయినా అందించడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస రెడ్డి విద్యార్థుల, డ్రైవర్స్ నీ ఉద్దేశిస్తూ అమూల్యమైన రోడ్డు భద్రత సూచనలు చేసారు. కార్యక్రమం నిర్వహణకి సహకరించిన కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.