మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం

కామారెడ్డి, జనవరి 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ల ఏర్పాటు ప్రగతిపై జిల్లా కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ లు ఏర్పాటుచేసి 1000 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి ఇప్పటికే ఇంధన శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ ల ఒప్పందం కుదిరిన నేపథ్యంలో జిల్లాల వారీగా ప్రగతిని బుధవారం ఉదయం ప్రజాభవన్‌ లో మంత్రులు సీతక్క, కొండా సురేఖలతో కలిసి డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ క్రమంలో మహిళలకు పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు అందుబాటులోకి తెస్తున్నాం. పెద్ద మొత్తంలో డబ్బు మహిళా సంఘాల చేతులకి వస్తున్న క్రమంలో వారు వివిధ వ్యాపారాలు చేసుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి వసతులు కల్పించాలని ఆదేశించారు.

మహిళా సంఘాలు సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ల ఏర్పాటుకు వారికి అందుబాటులో ఉన్న భూమిని గుర్తించండి, అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు. మహిళా సంఘాలు ప్లాంట్ల ఏర్పాట్లు లో ఆర్థిక సహాయం కోసం బ్యాంకు అధికారులతో సమన్వయం చేయాలని సూచించారు. మహిళా సంఘాల భూముల్లో ప్లాంట్‌ లో ఏర్పాటుకు విద్యుత్‌ శాఖ రెడ్కో ద్వారా టెండర్లు ఆహ్వానించిందని, త్వరలో టెండర్లు ఓపెన్‌ చేసి వాటిని ఖరారు చేస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు.

ఈ నేపథ్యంలో సంఘాలను గుర్తించి నిర్ధారించడం, భూ సేకరణ, బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం వంటి పనులను గ్రామీణ అభివృద్ధి శాఖ, జిల్లా కలెక్టర్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఒక మెగావాటు ఉత్పత్తికి నాలుగు ఎకరాలు అవసరం ఉంటుంది.. ప్రతి జిల్లాలో 150 ఎకరాలకు తగ్గకుండా రాష్ట్రవ్యాప్తంగా సుమారు నాలుగువేల ఎకరాలు సేకరించాల్సి ఉంటుందని కలెక్టర్లకు తెలిపారు.

దేవాదాయ, ఇరిగేషన్‌ శాఖల పరిధిలోని భూములను గుర్తించాలని.. కేంద్ర అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు భూమి అభివృద్ధి చేసుకునే అవకాశం ఏర్పడిరదని తెలిపారు.

ప్రతి నియోజకవర్గంలో స్మాల్‌, మైక్రో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు నాలుగు నుంచి ఐదు ఎకరాలు భూమి అవసరం అవుతుంది. చిన్నపాటి ఇండస్ట్రియల్‌ ఏరియాల ఏర్పాటుకు అధికారులు భూములు సేకరించాలని ఆదేశించారు. దీని ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యాపారం చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు.

అటవీ హక్కుల ద్వారా లభించిన భూముల్లో అవకాడో వంటి పంటలు సాగు చేస్తే అటవీ సంపద పెరగడంతో పాటు గిరిజనులు ఆర్థికంగా బలోపేతం అవుతారని తెలిపారు. రాష్ట్రంలో 6.67 లక్షల ఎకరాలను ఇప్పటివరకు ప్రభుత్వం గిరిజనులకు పంపిణీ చేయగా ఆ భూముల్లో లాభసాటి పంటల సాగు జరగడంలేదని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇకనుంచి ఆ భూముల్లో ఉపాధి హామీ, గిరిజన శాఖ, స్వయం సహాయక సంఘాల ద్వారా వచ్చే పథకాలు అన్నిటిని సమన్వయం చేసుకొని ఆర్థికంగా ప్రయోజనం కలిగించే పంటల సాగును ప్రోత్సహించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని గిరిజన శాఖ అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.

గిరిజనులకు ఆదాయం తక్కువగా ఉంటుంది … భూమి లభ్యత ఎక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలో అచ్చంపేట నుంచి ఆదిలాబాద్‌ వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో భూములపై అధికారులు దృష్టిపెడితే గిరిజనులకు ప్రయోజనం జరుగుతుందని మంత్రి సీతక్క తెలిపారు.

హైదరాబాద్‌ వంటి మహానగరాల్లో భారీ భవంతుల పైన సోలార్‌ పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో గుట్టల తో విస్తరించిన భూములు అత్యధికంగా ఉన్నాయి వీటి పైన సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ లు ఏర్పాటు చేసే ఆలోచన చేయాలని ఇంధన శాఖ అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. వీటి ఏర్పాటు ద్వారా ప్రభుత్వ భూముల పరిరక్షణకు అవకాశం ఉంటుందని వివరించారు.

ప్రధానమంత్రి పిఎం కుసుమ్‌ పథకంలో భాగంగా రైతులు రెండు మెగావాట్ల వరకు సోలార్‌ పవర్‌ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఏర్పడిరది.. ఈ దిశగా రైతులను చైతన్యం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తెలంగాణ రేడ్కో పోర్టల్‌ ద్వారా రైతులు సోలార్‌ పవర్‌ ఉత్పత్తికి దరఖాస్తులు చేసుకోవాల్సి ఉందని… దీని ద్వారా తక్కువ ధరకు విద్యుత్తు అందుబాటులోకి రావడం మే కాకుండా కాలుష్య రహిత విద్యుత్‌ ఉత్పత్తికి అవకాశం ఏర్పడుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లాలో 44 ఎకరాలు రెండు ప్రాంతాల్లో గుర్తించామని, మిగతా భూములు ఈ నెల 20 లోగా గుర్తిస్తామని తెలిపారు.

వీడియో అనంతరం కలెక్టర్‌ అధికారులతో మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 150 ఎకరాలు మిగిలిన 22 మండలాల్లో భూములు సబ్‌ స్టేషన్‌ దగ్గర్లో గుర్తించాలని సూచించారు. రెవిన్యూ ఇన్స్పెక్టర్‌, విద్యుత్‌ శాఖ ఏఈ లు, ఏపిఎం లు జాయింట్‌ ఇన్స్పెక్షన్‌ చేయాలని అన్నారు. అటవీ, దేవాదాయ, ఇరిగేషన్‌, తదితర ప్రభుత్వ భూములు సబ్‌ స్టేషన్‌ కు 5 కిలోమీటర్ల దూరంలో కూడా పరిశీలించాలని తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్‌ లో ఇంధన శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ లోకేష్‌, సేర్ప్‌ సీఈవో దివ్య దేవరాజన్‌, ట్రాన్స్కో సీఎం డి కృష్ణ భాస్కర్‌, తదితరులు, కామారెడ్డి జిల్లా అటవీ అధికారిణి నిఖిత, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ట్రాన్స్కో ఎస్‌.ఈ. ఎన్‌.శ్రావణ్‌ కుమార్‌ , జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్‌, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారిణి రజిత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సైబర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »