బాన్సువాడ, జనవరి 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు ఆశా వర్కర్లు బైఠాయించి ధర్నా చేపట్టి ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకునికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పి సంవత్సరం గడిచిన ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారానికి ఎటువంటి అడుగులు వేయలేదని, సమస్యలను పరిష్కరించలేకపోతే సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యమ కార్యచరణ చేపడతామన్నారు. కార్యక్రమంలో ఆశా వర్కర్ల అధ్యక్షురాలు పల్లవి, సుజాత, విజయలక్ష్మి ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.