ఖమ్మం, జనవరి 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఖమ్మం జిల్లా ఖమ్మం నగర సమగ్ర అభివృద్దే ధ్యేయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరావు పనిచేస్తున్నారని ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్ పునుకొల్లు నీరజ తెలిపారు.
ప్రజా సమస్యలన్నింటిని ప్రజా సర్కార్ పరిష్కరిస్తుందన్నారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రజా సమస్యలు తమ దృష్టికి రాగానే వెను వెంటనే చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సూచనల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 30,32.33,34,36,47,48 డివిజన్ లో పంపిణీ చేశారు. తుమ్మల వివిధ కార్యక్రమాల్లో పని ఒత్తిడి కారణంగా రాలేకపోయారని, అందుకే చెక్కులను ఆలస్యం చేయకుండా సకాలంలో లబ్ధిదారులకు అందజేయాలని తమకు సూచించారని మేయర్ నీరజ వివరించారు.

కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు ఎర్రం బాలగంగాధర్ తిలక్ మరియు 46 డివిజన్ కార్పొరేటర్ కన్నన్ లక్ష్మీప్రసన్న, ఎస్టీ సేల్ అధ్యక్షుడు దేవత శంకర్ నాయక్, రమేష్ గౌడ్, శ్రీశైలం, చట్టు మంగ, లింగం పల్లి సైదులు, దేవత దివ్య, ముద్దు కృష్ణ, శ్రీను, అప్పల రవి, టి రాంబాబు, సాదే శంకర్, తురక వీరభద్రమ్, పిడుగు మల్లికార్జున్,
పిడుగు ఉపేందర్, బెడదమ్ సత్యనారాయణ, నల్లపు శ్రీనివాస్, బొమ్మ సైజులు, గూడెపు నాగరాజు, మాజీ వార్డ్ నెంబర్ సింగం అంజయ్య, బోజెడ్ల సత్యనారాయణ, ఎస్.కె. జాకీర్, కురుమ లింగస్వామి, జానీ సురేషు, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.