బాన్సువాడ, జనవరి 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వర్ని మండలంలోని చింతల్ పేట్ గ్రామంలో పశు వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత గర్భకోశ చికిత్స శిబిరాన్ని శుక్రవారం మాజీ జెడ్పిటిసి హరిదాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో గర్వకోశ వ్యాధి ఉన్న పశువులకు ఉచితంగా నట్టల నివారణ మందులు అందజేశారు.
శిబిరంలో మేలైన జాతి దూడల ప్రదర్శన నిర్వహించడంతోపాటు పాలు ఎక్కువ ఇస్తున్న గేదెలకు నిర్వహించిన పాల పోటీల్లో ఎంపికైన పశువులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాడి రైతులు పశువులకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు ముందస్తుగా నట్టల నివారణ మందులను వేయించాలన్నారు.కార్యక్రమంలో పశువైద్యాధికారి సతీష్, సంతోష్, వి ఎల్ వో జ్యోతి, గోవింద్, ప్రవీణ్,బాగారెడ్డి, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.