బాన్సువాడ, జనవరి 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని వెంకటేశ్వర ఆలయం, తిమ్మాపూర్ వెంకటేశ్వర ఆలయాలను రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ వెంకటేశ్వరుని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, నర్సింగ్ రావు, నార్ల సురేష్ గుప్తా, మోహన్ నాయక్, నేమానీ బుజ్జి, పిట్ల శ్రీధర్, గోపాల్ రెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.