బాన్సువాడ, జనవరి 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ నియోజకవర్గంలోని బడా పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవానికి ఆదివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం హన్మాజిపేట్, కోనాపూర్ గ్రామాల మీదుగా బాన్సువాడ పట్టణ శివారులోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించనున్నట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరుల స్తూపం నుండి ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించినట్లు ఆయన తెలిపారు. మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు స్థానిక నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలన్నారు.