కామారెడ్డి, జనవరి 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
పిఆర్టియు తెలంగాణ క్యాలెండర్ను శనివారం కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఎంఎల్ఏ క్యాంప్ ఆఫీస్ వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర గొప్పదని, దానికి అనుగుణంగా అందరూ కృషి చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అంబీర్ మనోహర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జనపాల లక్ష్మీరాజం, రాష్ట్ర మరియు జిల్లా బాధ్యులు ప్రభాకర్, గిరి, సురేందర్, వెంకట్, ఎల్లా గౌడ్, సబాత్ కృష్ణ, సునీల్, బాల్ చంద్రం, శుభ రత్నం తదితరులు పాల్గొన్నారు.