యువజన ఉత్సవాల తెలుగు రాష్ట్రాల ప్రతినిధిగా శైలి బెల్లాల్‌

నిజామాబాద్‌, జనవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

భారత ప్రభుత్వము ప్రతి సంవత్సరము జనవరి 12 స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ యువజన ఉత్సవాలలో భాగంగా ఈ సంవత్సరం ఉత్సవాలు దేశ రాజధాని ఢల్లీిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్నారు, జాతీయ యువజన ఉత్సవాలలో పాల్గొనడం కోసము అన్ని రాష్ట్రాల నుంచి వివిధ పోటీల ద్వారా ఎంపిక చేయబడ్డ యువతి యువకులకు ఆహ్వానం అందించారు.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన బృందానికి రామ్మోహన్‌ నాయుడు, తెలంగాణ నుంచి వచ్చిన బృందానికి జి కిషన్‌ రెడ్డి స్వాగత విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యువతి యువకులతో కేంద్ర మంత్రులు తమ తమ ప్రాంతాలలోని విశేషాల గురించి అడిగి తెలుసుకున్నారని, కేంద్ర ప్రభుత్వము యువత కోసం ఇస్తున్న పథకాల గురించి భవిష్యత్తులో ప్రభుత్వము యువత కోసం చేయబోతున్న కార్యక్రమాల గురించి వివరించినట్టు తెలిపారు.

నిజామాబాద్‌ కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో యువతి యువకుల కోసం కేంద్ర భారత ప్రభుత్వం యొక్క నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ ను నెలకొల్పాలని తద్వారా ఉమ్మడి జిల్లా యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆ దిశగా చొరవ తీసుకొని శిక్షణ సంస్థను కేటాయిస్తే దాని పూర్తి నిర్వహణ బాధ్యతను తాము తీసుకుంటామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో విన్నవించినట్టు జిల్లా యువజన అధికారిని శైలి బెల్లాల్‌ తెలిపారు.

కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడుతో పౌర విమానాయన శాఖ యొక్క ఉద్యోగ ఉపాధి కల్పన విషయంలో అవసరమయ్యే శిక్షణ కేంద్రాలను విమానయాన శాఖలో ఉండే ఉద్యోగ అవకాశాలను గుర్తించి తది అనుగుణంగా నైపుణ్య అభివృద్ధి కలిగించడం కోసము తమ జిల్లాలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని విన్నవించినట్టు తెలిపారు.

ఇద్దరు కేంద్ర మంత్రులు తమ వినతికి సానుకూలంగా స్పందించి తప్పకుండా ఆ విషయం పట్ల ఆలోచిస్తామని సంబంధిత మంత్రిత్వ శాఖతో చర్చించి నైపుణ్య అభివృద్ధి కేంద్రం యొక్క ఏర్పాటు గురించి చొరవ తీసుకుంటామని తెలిపినట్టు తెలిపారు.

రెండు రాష్ట్రాల యువతి యువకులకు నేతృత్వం వహించే అవకాశం రావడం ఇన్చార్జిగా రెండు రాష్ట్రాల యొక్క ప్రతినిధిగా జాతీయ యువజన ఉత్సవాలలో పాల్గొనడం ఒక గొప్ప అనుభూతిగా ఉందని తనను నమ్మి ఈ అవకాశాన్ని కల్పించిన యువజన మంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ఈ సందర్భంగా శైలి బెల్లాల్‌ తెలిపారు.

Check Also

హామీలు వెంటనే అమలుపర్చాలి

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిఆర్‌ఎస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »