మోర్తాడ్, జనవరి 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వెంటనే అమలు చెయ్యాలని ఆదివారం మెండోర మండల ఎంఆర్‌పిఎస్ నాయకుల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశం ర్యాలీ రూపంలో జరిగింది. మెండోర మండల కేంద్రం మొత్తం 100 డప్పులతో ర్యాలీ నిర్వహించారు. సమావేశాన్ని ఎంఆర్‌పిఎస్ మండల నాయకులు మాకురి గణేష్ మాదిగ ప్రారంభించారు. సమావేశం ఎంఆర్‌పిఎస్ సీనియర్ నాయకులు దుమాల శేఖర్ మాదిగ అధ్యక్షతన జరిగింది.
సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్‌పిఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ హాజరై మాట్లాడారు. గౌరవ సుప్రీం కోర్టు 1 ఆగస్టు 2023 నాడు ఇచ్చిన తీర్పును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణను రెండు సార్లు సాధిస్తే వర్గీకరణ ఉద్యమంలో వర్గీకరణను 3 సార్లు సాధించామని తెలియజేశారు.
వర్గీకరణ ఉద్యమానికి సమాజంలో అన్ని వర్గాల మద్దతు ఉన్నదని, కానీ మాలలను సమాజం చేదరించుకుంటుంది అని చెప్పారు. ఈ నెల 23 నాడు మంద కృష్ణ మాదిగ నిజామాబాద్ జిల్లాకు కేంద్రానికి రాబోతున్నారని, ఆ కార్యక్రమాన్ని మండలం నుంచి వేల మంది మాదిగలు వచ్చి విజయవంతం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 7 నాడు జరిగే వెయ్యి గొంతులు, లక్ష డప్పులు మహా సాంస్కృతిక కార్యక్రమాన్ని లక్షల మందితో విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
కార్యక్రమంలో ప్రజా సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు సావెల్ గంగాధర్, మాజీ ఎంపీపీ కమలాకర్, సుంకేట సురేష్, నల్లూరి సాయన్న, ఎంఆర్‌పిఎస్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగం రాజేష్, ఎంఆర్‌పిఎస్ జిల్లా సీనియర్ నాయకులు ఉంగరాల రాజేశ్వర్, బాల్కొండ ఎంఆర్‌పిఎస్ అధ్యక్షులు నల్ల విక్లేష్, ఎర్గట్ల ఎంఆర్‌పిఎస్ అధ్యక్షులు రాజేష్, మెండోర ఎంఆర్‌పిఎస్ ఉపాధ్యక్షులు గుంటి నిశాంత్, మెండోర ఎంఆర్‌పిఎస్ ప్రధాన కార్యదర్శి మాకురి గణేష్, ఎంఆర్‌పిఎస్ జిల్లా నాయకులు కనక శ్రీదీప్, అన్ని గ్రామాల కుల సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.