ఖమ్మం, జనవరి 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఖమ్మం గట్టయ్య సెంటర్ రోటరీ లింబ్ సెంటర్లో డిస్ట్రిక్ట్ ఎన్నారై ఫౌండేషన్, ఖమ్మం రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో 23 మంది దివ్యాంగులకు కృత్రిమ పాదాలు, 10 మంది మహిళలకు కుట్టు మిషన్లు, 6 వికలాంగులకు ట్రై సైకిళ్ళు ఉచితంగా పంపిణీ చేశారు. వీటి విలువ సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దొడ్డపనేని గిరిజ హరినాథ్ , సామినేని రవికుమార్, శావలి సునీల్ గాంధీ లు అమెరికా నుండి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోటరీ, డిఎన్ఎఫ్ వారి సేవలను కొనియాడారు. గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడడం చాలా సంతోషకరంగా ఉందన్నారు.
శావిలి సునీల్ గాంధీ రోటరీ సేవలను అభినందిస్తూ ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయలను దివ్యాంగులకు సహాయార్థం అందజేస్తానని చెప్పారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు నల్లమోతు రవీందర్ నాథ్, ట్రస్ట్ వైస్ చైర్మన్ కాళ్ళ పాపారావు, కార్యదర్శి దొడ్డపనేని సాంబశివరావు, హరి శ్రీనివాస్, ప్రాజెక్ట్ కో ఆర్డినేజర్ పసుమర్తి రంగారావు, పలివేల భూషణ్ రావు, నాగేశ్వరరావు, సుధాకర్, ఐ రామకృష్ణ, బి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.