హైదరాబాద్, జనవరి 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జగిత్యాల పట్టణం 29వ వార్డు కు చెందిన కుక్కల చిన్న భీమయ్య వీసా గడువు ముగిసి సౌదీ అరేబియాలోని దమ్మామ్‌లో అక్రమ నివాసిగా చిక్కుకుపోయాడు. అతని కుమారుడు సునీల్ బోన్ మారో (ఎముక మూలుగు) వ్యాధితో ఆసుపత్రి పాలయ్యాడు. బోన్ మారో మార్పిడి చికిత్సకు దాతగా భీమయ్యను సౌదీ నుంచి రప్పించాలని అతని భార్య గంగ లక్ష్మి కాంగ్రేస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి సహాయంతో సీఎం ఏ. రేవంత్ రెడ్డికి మెయిల్ ద్వారా వినతిపత్రం పంపించారు.
చికిత్సకు కావలసిన డబ్బు కోసం తమ ఇల్లు అమ్మడానికి కూడా భీమయ్య ఇండియాకు రావలసిన అవసరం ఉన్నదని ఆమె అన్నారు. సౌదీ లో ఉన్న సామజిక సేవకులు గాజుల నరేష్ స్థానిక అధికారులతో పాటు రియాద్ లో ఉన్న ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేస్తున్నారు.