నిజామాబాద్, జనవరి 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
విశ్వహిందూ పరిషత్ యొక్క అనుబంధ సంస్థ దుర్గావాహిని ఆధ్వర్యంలో జిల్లాలోని పలుచోట్ల సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు.
బాల్కొండ మండల కేంద్రము మరియు బుస్సాపూర్, ఇందూరు నగరంలోని ఇంద్రాపూర్, మోస్రా మండల కేంద్రంలో యువతులు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.
ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదిన సందర్భంగా యువతులు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్టు దుర్గా వాహిని జిల్లా సంయోజక రaాన్సీ రాణి తెలిపారు.
ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ హిందూ యువతులు, మహిళల్లో జాతీయ భావనను మరియు దేశభక్తిని, హిందుత్వ నిష్ట పెంపొందించడం, జిహాదీలు, మతమార్పిడి ముఠాల నుంచి తమను తాము కాపాడుకుంటూ తమ కుటుంబాలను చైతన్యం చేయాల్సిన గురుతర బాధ్యత మహిళల మీదే ఉంటుంది కాబట్టి వారిని చైతన్యం చేయటమే లక్ష్యంగా దుర్గావాని పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి ఆర్‌ఎస్‌ఎస్ మహిళా విభాగం రాష్ట్ర సేవికా సమితి జిల్లా కార్యవాహిక అహల్య, గ్రామీణ వికాస్ జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్ బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో దుర్గా వాహిని కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.