బాన్సువాడ, జనవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బీర్కూరు మండలంలోని దామరంచ సొసైటీ చైర్మన్, డిసిసిబి డైరెక్టర్ కమలాకర్ రెడ్డి గురువారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్ సీఈఓ ను దేవేందర్ శ్యామ్ ను సిమ్లాలోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా డిసిసిబి డైరెక్టర్ కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలలో కోపరేటివ్ బ్యాంకుల పనితీరు విధి విధానాలను తెలుసుకోవడానికి జిల్లా డిసిసిబి ఉపాధ్యక్షులు, డైరెక్టర్‌తో కలిసి వారం రోజులపాటు ఆయా రాష్ట్రాల్లో కోపరేటివ్ బ్యాంకుల పనితీరుపై శిక్షణ కార్యక్రమానికి వచ్చినట్లు వారు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నందున రైతంగాని మరింత బలోపేతం చేయడానికి ఈ పర్యటన ఎంతో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో గాంధారి సొసైటీ చైర్మన్, డిసిసిబి డైరెక్టర్ సాయికుమార్, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.