ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ విభాగాధిపతిగా డా. మావురపు సత్యనారాయణ రెడ్డి

డిచ్‌పల్లి, జనవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ విభాగాదిపతి గా డా.మావురపు సత్యనారాయణ రెడ్డి ని నియమిస్తూ వైస్‌ ఛాన్స్లర్‌ ప్రొఫెసర్‌ టి యాదగిరి రావు నియామకపు ఉత్తర్వులు అందించారు.

ఈ సందర్భంగా వైస్‌ ఛాన్స్లర్‌ ఆచార్య యాదగిరిరావు మాట్లాడుతూ డాక్టర్‌ సత్యనారాయణ రెడ్డి ప్రసిద్ధి చెందిన జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం న్యూ ఢల్లీి నుండి పీహెచ్డీ కొరకు మధుమేహం వ్యాధి నివారణ పై జరిపిన పరిశోధనలు గుర్తించదగినవని పేర్కొన్నారు. పీహెచ్డీ అనంతరం అమెరికాలోని ప్రఖ్యాత రడ్‌గర్స్‌ విశ్వవిద్యాలయం లో క్యాన్సర్‌ వ్యాధి నివారణకు జరిగిన పరిశోధన ఫలాలుగా పది అంతర్జాతీయ పేటెంట్లు సొంతం చేసుకోవడం విశ్వవిద్యాలయానికి గర్వకారణమని తెలిపారు. ఈ పరిశోధనల అనుభవాన్ని విశ్వవిద్యాలయ విద్యార్థులకు అందించి విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని సూచించారు.

ప్రస్తుతం విశ్వవిద్యాలయ కళాశాలకు వైస్‌ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్‌ సత్యనారాయణ రెడ్డి గతంలో అడిషనల్‌ కంట్రోల్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌గా, పబ్లికేషన్‌ సెల్‌ మరియు ఈక్వల్‌ ఆపర్చునిటీ సెల్‌లకు డైరెక్టర్‌గా విధులు నిర్వహించి ఉన్నతాధికారుల మన్ననలు పొందినారు.

ఈ నియామకాన్ని పురస్కరించుకొని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, సైన్స్‌ డీన్‌ ఆచార్య సిహెచ్‌ ఆరతి, డాక్టర్‌ వాసం చంద్రశేఖర్‌, డాక్టర్‌ బోయపాటి శిరీష, అకాడమిక్‌ కన్సల్టెంట్లు తదితరులు అభినందించారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 గురువారం, జనవరి.23, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – హేమంత ఋతువుపుష్య …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »