బాన్సువాడ, జనవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రోడ్లపై ప్రయాణించే వాహనదారులు రోడ్డు నియమ నిబంధనలు పాటించి ప్రమాద రహిత ప్రయాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం బాన్సువాడ ఆర్టీసీ డిపోలో జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా రోడ్డు భద్రత నియమాలపై ఆర్టీసీ డ్రైవర్లకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి హెల్మెట్, కార్లు భారీ వాహనాల్లో ప్రయాణించేవారు సీటు బెల్టు ధరించి, డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదని, ప్రమాదాలు జరగడం వలన ఎంతో మంది జీవితాలు అర్ధాంతరంగా వారి కుటుంబాలు రోడ్డుపై పడుతున్నాయన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండి వాహనదారులకు నిబంధనలపై అవగాహన కల్పించినట్లయితే ప్రమాదాలు జరగకుండా ఉంటుందన్నారు.
ఎటువంటి ప్రమాదాలు లేకుండా విధులు నిర్వహించిన డ్రైవర్లు అబ్బాస్ ఆలీ, పీవీ రెడ్డి, గణేష్ లను షాల్వతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ సరితా దేవి, సీఐ జాను బాయ్, సూపరిండెంట్ బసంత్, రాజారాం, ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు తదితరులు పాల్గొన్నారు.