కామారెడ్డి, జనవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లాకి జుక్కల్ మండలానికి చెందిన ఓంకార్ 10 సంవత్సరాల బాలుడు తలసేమియాలతో బాధపడుతూ వారికి కావలసిన ఓ పాజిటివ్ రక్తాన్ని ఐవిఎఫ్ యువజన విభాగం జగద్గిరిగుట్ట అధ్యక్షులు కాపర్తి నాగరాజు సాహరంతో తలసేమియా సికిల్ సెల్ సొసైటీలో పటోళ్ల జనార్దన్ రెడ్డి ఓ పాజిటివ్ రక్తాన్ని శనివారం అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు 20 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరం ఉంటుందని అలాంటి చిన్నారులకు కావలసిన రక్తాన్ని అందజేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని అన్నారు. రక్తదానానికి ముందుకు వచ్చిన పటోళ్ల జనార్దన్ రెడ్డికి ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అభినందనలు తెలిపారు. రక్తదానం చేయాలనుకున్నవారు వారి యొక్క వివరాలను 9492874006 కి తెలియజేయాలని అన్నారు.